Header Banner

టోల్ ప్లాజాల వద్ద క్యూలైన్లకు చెక్.. NHAI కీలక నిర్ణయం! ప్ర‌తిసారి మ‌నం రీఛార్జ్ చేస్తూ..

  Sat Mar 08, 2025 09:00        Business

ఇటీవ‌లే ఫాస్టాగ్ మ‌రియు టోల్ ప్లాజాకు సంబంధించిన కొత్త రూల్స్‌ను నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్ర‌వేశ‌పెట్టింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధ‌న‌లు అమలులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా టోల్‌ప్లాజాల వద్ద క్యూలైన్లను తగ్గించడానికి NHAI మరో కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహ‌నాల‌ క్యూలను పూర్తిగా త‌గ్గించేందుకు వినియోగదారుల ఫాస్టాగ్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్, స్మార్ట్ నంబర్ ప్లేట్ వివరాలను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. టోల్ ప్లాజాల వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. టోల్ సిబ్బంది వ‌ద్ద నుంచి ఏదైనా సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తితే ఇంకా అంతే సంగ‌తి. నిమిషాలు పాటు వెయిట్ చేయక‌త‌ప్ప‌దు. ఇలాంటి స‌మ‌యంలో టోల్ ప్లాజా వద్ద క్యూలైన్‌లో ఆగి.. టిక్కెట్ తీసుకునే అవ‌స‌రం లేకుండా ఫాస్టాగ్ ప్రాసెస్‌ను ప్రారంభించారు. ఐతే.. ప్ర‌స్తుతం మ‌న ఫాస్టాగ్ అకౌంట్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. వాటి నుంచి టోల్ వ‌ద్ద డ‌బ్బులు క‌ట్ అవుతాయి. అంటే ప్ర‌తిసారి మ‌నం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. టోల్ గేట్ వ‌ద్ద స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా.. కొంద‌రు ఒకేసారి పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేసుకుంటారు.

 

ఇది కూడా చదవండి: పాత నోట్లకు విపరీతమైన డిమాండ్! ఇంట్లో ఉన్న నోట్లను ఇలా అమ్ముకుని లక్షలు సంపాదించండి!

 

అయితే.. ఇప్పుడు టోల్ ప్రయాణం మ‌రింత సుల‌భ‌త‌రం చేసి, క్యూ లైన్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ఈ కొత్త ప‌ద్ధ‌తిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంశంపై బ్యాంక్ అధికారుల‌తో NHAI సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. దీంతో HSRC (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్), బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా ఆయా వాహనాలు టోల్ ప్లాజా వద్ద క్యూలైన్లో ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా టోల్ ప్లాజాలలో వాహనదారులకు ఆటో డెబిట్ వ్యవస్థను అవలంబిస్తామన్నారు NHAI అధికారులు. ఈ కొత్త నిబంధ‌న అమ‌లులోకి వ‌స్తే.. మ‌న వాహన నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ అకౌంట్‌ బ్యాంకులతో లింక్ చేయ‌బ‌డుతుంది. ఆ తర్వాత టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. టోల్ ప్లాజా వద్ద వాహన నంబర్ ప్లేట్ చదివిన వెంటనే, టోల్ పన్ను స్వయంచాలకంగా వారి ఫాస్టాగ్ ఖాతా నుంచి తగ్గించబడుతుంది. ఈ ఆటో డెబిట్ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఇకపై క్యూలైన్ ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక‌.. మొదటి దశలో దేశంలోని నాలుగు లేన్లు, అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులపై ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఆ తర్వాత దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం బ్యాంకులతో చర్చలు అధునాతన దశలో ఉన్నాయని, కానీ ఈ వ్యవస్థను ఒక నెల తర్వాత అమలు కావచ్చని అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NHAI #Tollplazas #Business #NewRules